News July 16, 2024
HYD: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. డాన్స్ మాస్టర్‌పై కేసు నమోదు
స్కూల్ డాన్స్ మాస్టర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. HYD బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే ఒకటో తరగతి విద్యార్థినితో డాన్స్ మాస్టర్ సారా <<13637337>>రవికుమార్<<>> (33) అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News October 16, 2024
షాబాద్ రావాలని మంత్రికి ఆహ్వానం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామదూత స్వామి ఆధ్వర్యంలో నవంబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవానికి రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాబాద్ మండలం దివ్యదామం ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానం అందించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణలతో స్వామిజీలు మంత్రిని ఆశీర్వదించారు.
News October 16, 2024
BREAKING: HYD: దంపతుల దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 16, 2024
HYD: ‘మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ’
అన్నదమ్ముళ్లలా ఐక్యంగా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎస్సీ వర్గీకరణ తెచ్చారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ రాజు వస్తాద్ ఆరోపించారు. లోయర్ బ్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ భవన్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాల మాదిగలను రెండుగా విభజించారని మండిపడ్డారు.