News October 22, 2024

HYD: విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

image

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని నేడు వందలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటలకు బర్కత్‌పుర చౌరస్తా నుంచి లక్డికపూల్‌లోని కలక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News November 25, 2025

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

image

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.

News November 25, 2025

HYD: బాక్సు ట్రాన్స్‌ఫార్మర్లతో బేఫికర్!

image

‘చుట్టూ కంచె లేని ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు.. పట్టించుకోని పాలకులు’.. తరచూ TGSPDCLకి మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులు. గ్రేటర్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించేలా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు, బాక్సు టైప్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలుత కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, మిగతా ఏరియాలకు విస్తరించనున్నారు.

News November 25, 2025

BREAKING: హబ్సిగూడలో విషాదం.. 10TH క్లాస్ స్టూడెంట్ సూసైడ్

image

హబ్సిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. 10వ తరగతి విద్యార్థిని(15) బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపనికి గురై సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకొన్న ఓయూ పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.