News December 6, 2024
HYD: విద్యార్థుల ఇంటికి హెడ్ మాస్టర్

విద్యాశాఖ అధికారుల చొరవతో స్కూల్ HMలు నేరుగా విద్యార్థుల ఇంటికొస్తున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మం. MEO వెంకట్ సూచనతో దాదాపూర్ GOVT స్కూల్ HM కృష్ణయ్య, ఉపాధ్యాయులు వెంకటయ్య, యాదగిరి, రాజేశ్ గురువారం రాత్రి విద్యార్థుల ఇంటికెళ్లారు. పిల్లలు చదువుతున్నారా? లేదా? అని ఆరా తీశారు. హోంవర్క్‌ను పరిశీలించి, పేరెంట్స్ శ్రద్ధ చూపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల HMలు ఇలా చొరవ తీసుకుంటే ఎలా ఉంటుంది? మీ కామెంట్?
Similar News
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.
News November 21, 2025
దానం డిసీషన్.. ఓవర్ టూ ఢిల్లీ

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలకు సంబంధించి MLA దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదించేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గతంలోనే స్పీకర్ కార్యాలయం దానంకు నోటీసులు అందజేసింది. ఆయన స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు పంపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ఢిల్లీ పెద్దలతో దానం చర్చించి నిర్ణయం తీసుకుంటారని టాక్.
News November 21, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సామాన్యులకూ ఛాన్స్?

వచ్చేనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్‌ను ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. 100 ఎకరాల్లో సదస్సు నిర్వహిస్తారు. వందలాది స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. 1,300 కంపెనీలు పాల్గొనే అవకాశముంది. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చూసే సౌకర్యం కల్పించినట్లు సమాచారం.


