News March 12, 2025

HYD: విద్యాశాఖ చివరి నుంచి పోటీపడే పరిస్థితి: సీఎం

image

HYDలోని రవీంద్రభారతిలో ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు ప్రాధాన్యమిచ్చే విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించామని, గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందన్నారు. విద్యాశాఖలో చివరి నుంచి పోటీపడే పరిస్థితికి తెలంగాణ దిగజారిందని, విద్యాశాఖ దిగజారడం ఆందోళనకరం, అవమానకరమన్నారు.

Similar News

News March 13, 2025

HYD: హోలీ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు: సీపీ

image

హోలీ నేపథ్యంలో HYDలో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గం. నుంచి శనివారం ఉదయం 6 గం. వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వైన్సులతో సహా.. గ్రేటర్ పరిధిలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలుంటాయని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారిపై అకారణంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

News March 13, 2025

HYD: యువతుల మధ్య వాగ్వాదం.. కేసు నమోదు

image

యువతిపై ఫిలింనగర్ PSలో అట్రాసిటీ కేసు నమోదైంది. టోలిచౌకిలో ఒకే రూమ్‌లో ఉంటున్న తనను మరో యువతి మానసిక వేదనకు గురిచేస్తోందని, ప్రశ్నిస్తే యువకులను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయసాగిందని బాధితురాలు తెలిపింది. ఇటీవల ఓ యువకుడికి తన ఫోన్‌తో మెసేజ్ చేసిందని, నిలదీస్తే ‘నిన్ను రేప్ చేయించి.. మర్డర్ చేయిస్తా’అంటూ బెదిరించిందని ఆమె వాపోయింది. ఈ మేరకు బాధితురాలు PSలో ఫిర్యాదు చేసింది.

News March 13, 2025

HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.

error: Content is protected !!