News July 5, 2024
HYD: విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ ఫొటో ఎగ్జిబిషన్

మాదక ద్రవ్యాల నిర్మూలనకై విద్యాశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జులై 31 వరకు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. గురువారం బంజారాహిల్స్‌లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి యాంటీ డ్రగ్స్ ఎగ్జిబిషన్ పోస్టర్ విడుదల చేశారు. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
Similar News
News November 22, 2025
HYD: పైలట్‌పై అత్యాచారయత్నం

అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు HYDలోని బేగంపేట PSలో ఫిర్యాదు చేసింది. ఓ ఏవియేషన్ సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60) సహోద్యోగి అయిన యువతిపై బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. సంస్థ పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్‌లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT


