News February 24, 2025
HYD: ‘విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ’

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ప్రొ.వెంకటదాస్ చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డీఏటీఏ ఆవిర్భవించడం ఆనందాయకమన్నారు. యుటీసీ, ఏఐసీటీ, ఎఫ్ఎస్ఆర్సీ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.
Similar News
News October 14, 2025
తిరుమల: 23 కంపార్టుమెంట్లలో భక్తులు

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వర స్వామి దర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 78,569 మంది భక్తులు దర్శించుకోగా.. 27,482 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.93కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News October 14, 2025
విశాఖ: ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

ముగ్గురు సైబర్ నేరగాళ్లను విశాఖ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలేనికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మెసెజ్ చేశారు. వివిధ కంపెనీల పేరిట రూ.15.51 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. టెలిగ్రామ్ గ్రూపు IP లాగ్స్ ద్వారా నంద్యాలకి చెందిన షేక్ షరీఫ్ రెహమాన్, అబ్ధుల్ రెహమాన్, హుస్సేన్ వలిని పట్టుకున్నారు.
News October 14, 2025
పొందూరు: కరెంట్ షాక్‌తో ఎలక్ట్రిషీయన్ మృతి

కరెంట్ షాక్‌తో ఓ ఎలక్ట్రీషియన్ మృతిచెందిన ఘటన పొందూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు మేరకు.. మండలంలోని పుల్లాజీపేట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు (39) ఎలక్ట్రిషీయన్‌గా జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఇంట్లో ఎలక్ట్రానిక్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.