News February 2, 2025

HYD: విద్యుత్‌ తక్షణ సేవలకు టోల్‌ ఫ్రీ నం. 1912

image

ప్రస్తుత విద్యుత్‌ వినియోగం డిమాండ్‌ తీరును పరిశీలిస్తే రానున్న వేసవిలో డిమాండ్‌ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిమాండ్‌ ఎంతగా పెరిగినా.. దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే టోల్‌ ఫ్రీ 1912 నంబర్‌ ద్వారా తక్షణ సేవలను పొందాలని వారు సూచించారు.

Similar News

News March 10, 2025

HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

image

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.

News March 10, 2025

HYD: సీఎం రేవంత్ దిగజారుస్తున్నారు: కవిత

image

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్ఠను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉన్నతంగా ఉందని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తే.. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 10, 2025

మార్చిలో అందని సన్న రేషన్ బియ్యం

image

మార్చి నెల నుంచి పేదలకు సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ, రేషన్ దుకాణాల్లో సరఫరా సమస్యల కారణంగా పేదలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అవసరం 1.51 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు సరఫరా అయినది కేవలం 62,346 మెట్రిక్ టన్నులు మాత్రమే. దీంతో, ఈసారి దొడ్డు బియ్యం ఇస్తున్నారు.

error: Content is protected !!