News February 2, 2025
HYD: విద్యుత్ తక్షణ సేవలకు టోల్ ఫ్రీ నం. 1912

ప్రస్తుత విద్యుత్ వినియోగం డిమాండ్ తీరును పరిశీలిస్తే రానున్న వేసవిలో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిమాండ్ ఎంతగా పెరిగినా.. దానికి తగ్గట్టుగా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 1912 నంబర్ ద్వారా తక్షణ సేవలను పొందాలని వారు సూచించారు.
Similar News
News March 11, 2025
HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.
News March 11, 2025
HYD: పోలీసులను అభినందించిన సీపీ

బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణాను అరికట్టి బాధితులను ప్రజ్వల షెల్టర్ హోమ్కు తరలించిన ఘటనలో ప్రతిభ కనబరిచిన ఫిలింనగర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పంజాగుట్ట కానిస్టేబుల్ లావణ్యకు HYD సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో వీరు చూపిన శ్రద్ధ, అంకితభావాన్ని కొనియాడారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.
News March 11, 2025
HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYDతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.