News February 2, 2025
HYD: విద్యుత్ తక్షణ సేవలకు టోల్ ఫ్రీ నం. 1912

ప్రస్తుత విద్యుత్ వినియోగం డిమాండ్ తీరును పరిశీలిస్తే రానున్న వేసవిలో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిమాండ్ ఎంతగా పెరిగినా.. దానికి తగ్గట్టుగా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 1912 నంబర్ ద్వారా తక్షణ సేవలను పొందాలని వారు సూచించారు.
Similar News
News November 22, 2025
ASF జిల్లాలో రిజర్వేషన్లపై ఉత్కంఠ

ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్లపై గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 50 శాతాన్ని మించకుండా రిజర్వేషన్ల ప్రక్రియలు కొనసాగించనున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులంతా అధికారిక ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
News November 22, 2025
గద్వాల్: ఆటో బోల్తా.. డ్రైవర్కు తీవ్ర గాయాలు

అలంపూర్ పట్టణంలోని రైతు సంఘం దగ్గర శనివారం లోకల్ ఆటో డివైడర్ను ఢీకొని ముందు చక్రం విరిగి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ ఎస్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
News November 22, 2025
‘RRR’పై రీసర్వే చేయండి.. గడ్కరీకి కవిత లేఖ

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్మెంట్పై రీసర్వే చేయాలని కోరుతూ కేంద్రమంత్రి గడ్కరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ‘రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని గ్రామాల్లో అలైన్మెంట్ను చాలాసార్లు <<18295771>>మార్చారు<<>>. రాజకీయ నేతలు, భూస్వాముల కోసం ఇలా చేశారని స్థానికులు నమ్ముతున్నారు. చిన్న రైతులే నష్టపోతున్నారు’ అని పేర్కొన్నారు. రీసర్వే చేసి, అలైన్మెంట్ ఖరారుకు ముందు స్థానికులతో చర్చించాలని కోరారు.


