News August 23, 2024
HYD: వినికిడి సమస్య ఉందా..? ENT వెళ్లండి!
కోఠి ENT ఆసుపత్రిలో వినికిడి సమస్య సంబంధించిన సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖరీదైన వినికిడి యంత్రాలు, సర్జరీలు చేయించుకున్న వారికి LOC, CMRF ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చికిత్సల అనంతరం ఉచితంగా వినికిడి యంత్రాలతో పాటు, ఏడాది పాటు AVT( Auditions Verbal Therapy) అందిస్తారు.
Similar News
News September 13, 2024
HYD: దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్, తిరుపతి-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య రైలు నడపనున్నట్లు తెలిపారు.
News September 12, 2024
BREAKING.. ఎమ్మెల్యే గాంధీపై నమోదైన కేసుల ఇవే
HYDలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనను సుమోటోగా తీసుకున్న సైబరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే గాంధీపై కేసు నమోదు చేశారు. A1 ఎమ్మెల్యే గాంధీ సహా, 15 మంది అనుచరుల మీద కేసులు బుక్ చేశారు. 189, 191(2), 191(3), 61, 132, 329, 333,324(4), 324(5) 351(2) సహా ఇతర సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయని అధికారులు తెలిపారు.
News September 12, 2024
HYD: దౌర్జన్యమా, గుండాయిజమా..?: KTR
దౌర్జన్యమా, గుండాయిజమా..? ఇందులో ఏది ఇష్టమో చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ గుండాల బెదిరింపులకు BRS సైనికులు భయపడరని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తామంతా అండగా నిలబడతామన్నారు. మీ అవినీతి దుష్పరిపాలన నుంచి రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని, మీ భయానక వ్యూహాలు మా సంకల్పానికి ఆజ్యం పోస్తాయన్నారు.