News November 26, 2024
HYD విశ్వనగరంగా మారడంలో OU పాత్ర ఉంది: దినేశ్ చంద్ర శర్మ

HYD విశ్వనగరంగా మారడంలో నగరంలో ఉన్న జ్ఞాన సంపద కీలకంగా పనిచేస్తుందని సీనియర్ సైన్స్ జర్నలిస్ట్ దినేష్ చంద్ర శర్మ అన్నారు. విశ్వనగరంగా మారడంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఓయూ, ఐఐసీటీ వంటి సంస్థలను చాలా కాలం క్రితమే నెలకొల్పడంతో పాటు దశాబ్దాలుగా ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు దీనికి తోడయ్యాయని అభిప్రాయపడ్డారు. ఓయూ జర్నలిజం విభాగంలో విద్యార్థులతో ముఖాముఖికి ఆయన హాజరయ్యారు.
Similar News
News February 13, 2026
గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
News February 12, 2026
హైదరాబాద్‌లో నో-స్టోరీ జోన్స్

HYD ఫ్రెండ్స్ సర్కిల్‌లో కొత్త సోషల్ రూల్ సైలెంట్‌గా వ్యాపిస్తోంది. కొన్ని ప్రదేశాలను ‘నో-స్టోరీ జోన్స్’గా ప్రకటిస్తున్నారు. చెరువు పక్కన రాళ్లు, సగం పూర్తయిన మెట్లు, అస్పష్టమైన కాలనీ మైదానాలనే ఎంచుకుంటున్నారు. ఆ స్పాట్‌లో ఫోన్లను ఒకచోట బోర్లా పెడతారు. ఫొటో క్లిక్ చేసినా అది SMలోకి వెళ్లదు. జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటాయి. ఈ ఆఫ్-గ్రిడ్ పాకెట్స్ స్నేహాలను అల్గారిథమిక్ ఎక్స్‌పోజర్ నుంచి రక్షిస్తున్నాయి.
News February 12, 2026
HYDలో డెంగీ కేసులు.. అసలు నిజం ఇదే!

కేంద్ర ప్రభుత్వ సంస్థ NCVBDC డేటా ప్రకారం TGలో 2021లో కేవలం 220గా ఉన్న అనుమానిత చికెన్ గున్యా కేసులు 2024 నాటికి 13,592కు చేరుకున్నాయి. GHMC జనవరి 2026లో డెంగీ కేసులు 30% తగ్గాయని ప్రకటించింది. ఇది కేవలం ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన డేటా మాత్రమే. ఎక్కువ మంది ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లడం, IHIP పోర్టల్‌లో డేటా నమోదులో జాప్యం వల్ల అసలు సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


