News February 4, 2025
HYD: విషప్రచారం చేసిన రేవంత్ రెడ్డి: BRS

CM రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై విషప్రచారం చేశారని BRS పార్టీ పేర్కొంది. ‘కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకూ పనికిరాదంటూ విషప్రచారాలు చేసిన రేవంత్ & కో.. నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్కు 20టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. మరి నువ్వు పనికిరాదన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయి రేవంతూ? ఇప్పటికైనా.. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల కల్పతరువు కాళేశ్వరమే’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News December 6, 2025
హైదరాబాద్లో హారన్ మోతలకు చెక్.!

హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
News December 6, 2025
HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.
News December 6, 2025
HYD: మహా GHMCలో 250 డివిజన్లు.!

గ్రేటర్లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.


