News June 28, 2024
HYD: విషాదం.. కుక్కల దాడిలో బాలుడి మృతి
HYD శివారులో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు పరిధి ఇస్నాపూర్‌లోని మహీధర వెంచర్‌లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే పటాన్‌చెరు పరిధి ముత్తంగిలో 7 నెలల చిన్నారిని కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి మృతదేహంతో పాటు గాయపడిన 7 నెలల చిన్నారిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 13, 2024
HYD: అలా చేస్తే ఉద్యమం తప్పదు..హెచ్చరిక!
రాష్ట్రంలోని డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు వీఆర్వోలను కేటాయిస్తే ఉద్యమం తప్పదని HYD నగరంలో సివిల్ ఇంజినీర్లు, సర్వేయర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోస్టుకు అర్హత లేని వీఆర్వోలను ప్రభుత్వం కేటాయిస్తుందన్న సమాచారంతో అభ్యర్థులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
News December 13, 2024
HYD: పండుగలా నిర్వహించండి: కలెక్టర్
సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40% పెంపు ప్రారంభోత్స ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
News December 13, 2024
ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు భద్రత కల్పించండి
మరణించిన ఆటోడ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు సామాజిక భద్రత బీమా పథకం రెన్యువల్‌తోపాటు, వారి కుటుంబాలకు అందించే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచాలని INTUC నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. గురువారం మంత్రిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రమాదంలో అంగవైకల్యం చెందిన డ్రైవర్లకు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు.