News April 2, 2024

HYD: విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

image

ఓ ప్రేమజంట ఆత్మహత్య ఘటన RR జిల్లా కొందుర్గులో జరిగింది. SI తెలిపిన వివరాలు.. ఉత్తరాశిపల్లి వాసి శ్రీకాంత్, కిస్మత్‌పురకు చెందిన బాలిక ప్రేమించుకుంటున్నారు. మార్చి 27న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భయపడిన వారు 30న రాత్రి పురుగు మందు తాగారు. అదే రోజు బాలిక చనిపోగా ఈరోజు శ్రీకాంత్ ఆస్పత్రిలో చనిపోయాడు. అబ్బాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News December 4, 2025

HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

image

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్‌లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్‌నగర్‌లో ఆయన Way2Newsతో మాట్లాడారు.

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

News December 4, 2025

HYD: ఫ్యూచర్ సిటీకి సల్మాన్‌ఖాన్!

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌లో మీడియా, వినోద రంగాల్లోని పెట్టుబడిదారులతో జరిగే సమావేశంలో సల్మాన్‌ఖాన్ ప్రసంగించే అవకాశం ఉంది. ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్‌ఖాన్‌ను కలిసిన విషయం తెలిసిందే.