News July 6, 2024
HYD: విస్తరిస్తోన్న డెంగ్యూ వ్యాధి.. జర జాగ్రత్త..!

HYD, RR, MDCL జిల్లాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్యారోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు HYDలో 114, మేడ్చల్లో 108, రంగారెడ్డిలో 51 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా బాధితుల సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. HYDలో మే నెలలో 39, జూన్లో 56, జులైలో కేవలం 4 రోజుల్లోనే 19 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు.
Similar News
News November 11, 2025
జూబ్లీబైపోల్: మోడల్ బూత్లు.. మొబైల్ డిపాజిట్ కౌంటర్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్లు ఏర్పాటు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం, పోలింగ్ బూత్లోకి అనుమతి లేని మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఓటింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు, పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే మాక్ పోలింగ్ (అనుకరణ పోలింగ్) ప్రారంభమైంది.
News November 11, 2025
HYD: ఈ రోజు సెలవు.. మీ పని ఇదే!

జూబ్లీహిల్స్లో నేడు ఓటింగ్ డే. సెలవు దొరికింది.. ఇంటిదగ్గర చిల్ అవుదాం అనుకుంటున్నావా? రేపు మోరీ నిండింది, వర్షం పడి రోడ్లు బ్లాక్ అయ్యాయి, గుంతలు పడ్డాయి అని ప్రజాప్రతినిధులని ప్రశ్నిస్తే నిన్ను పట్టించుకోరు. ఆ.. ‘నా ఒక్క ఓటుతో ఏం మారుతుందిలే’ అనుకోవచ్చు.. ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారు ఆయన ఘటనలు చాలా ఉన్నాయి. ఓటేసి ఓ సెల్ఫీ పెట్టు. ఇష్టమైన సినిమా కోసం పెట్టే శ్రద్ధ.. మీ ప్రాంతం కోసం కూడా పెట్టు.
News November 11, 2025
ఈసారి జూబ్లీహిల్స్ ఆదర్శం కావాలి.. ఓటెత్తి తీరాలి..!

2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది ఓటేసింది ఎప్పుడంటే 2009లోనే.. అప్పుడు 52 శాతం మంది ఓటు వేశారు. ఆ తరువాత ఈ ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఈ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందూ ఇలానే అనుకుంటారు. కానీ అలా జరగడం లేదు. మరి నేడైనా అందరూ పోలింగ్ కేంద్రాలకు కదలి ఓటెత్తి ఆదర్శంగా నిలవాలి.


