News July 14, 2024

HYD: వీధి కుక్కల బెడదపై ఓ విధానం లేదా: హైకోర్టు

image

HYD నగరంలో వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు చనిపోతున్న ఘటనలపై హైకోర్టు ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వానికి ఓ విధానం లేకపోవడం ఏంటి..? అని ప్రశ్నించింది. కేవలం పరిహారం చెల్లించి, చేతులు దులుపుకుంటామంటే కుదరదని, భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చూడాలంది. ఈ మేరకు ప్రభుత్వం GHMC, పోలీసు, ఇతర శాఖలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.

Similar News

News January 18, 2025

రేవంత్ తప్పి దారిన సీఎం పీఠంపై కూర్చున్నారు: డీకే అరుణ

image

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆమె మాట్లాడుతూ.. KCR పై వ్యతిరేకతతో తప్పి దారిన రేవంత్ సీఎం పీఠంపై కూర్చున్నారు అంతే తప్పా కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. తెలంగాణలో పథకాల అమలుపై మహారాష్ట్ర, హర్యానాలో చెప్పిన అబద్ధాలనే రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారని మండిపడ్డారు. ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు.

News January 18, 2025

HYD: BRAOUలో ట్యూషన్ ఫీజుకు చివరితేదీ ఈ నెలే.!

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సార్వతిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, 2nd, 3rd ఇయర్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ జనవరి 25 అని విద్యార్థి సేవల విభాగాల అధిపతి డా. వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ పొంది సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినవారు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. సందేహాలుంటే 040-236080222 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. 

News January 18, 2025

JNTU: కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇంటర్వ్యూ

image

JNTU అఫిలియేటెడ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి అఫిలియేటెడ్ ఆడిట్ సెల్ డైరెక్టర్ తారా కళ్యాణి ఆధ్వర్యంలో వర్సిటీలో ఫ్యాకల్టీలకు ఇంటర్వ్యూలో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 20 వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయని వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి తెలిపారు. రసాయన, ఆంగ్ల, గణిత శాస్త్ర విభాగానికి సంబంధించి అభ్యర్థులకు వీసీ ఇంటర్వ్యూ నిర్వహించారు.