News September 6, 2024

HYD: వీధుల్లోకి మళ్లీ చెత్త డబ్బాలు

image

చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అటకెక్కించింది. వీధుల్లో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగం నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలకు చెత్త డబ్బాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశాలిచ్చింది. అదనంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా 20కేజీల బరువును తట్టుకునే మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

Similar News

News September 20, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

image

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్‌ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమంలో నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు దక్కినట్లు తెలిపారు.

News September 20, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

News September 20, 2024

28న రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’

image

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘కళా మహోత్సవ్’ మొదటి ఎడిషన్ను ఈనెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న ఈ మహోత్సవాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సందర్శకులు https://visit.rashtrapatibhavan. gov.in వెబ్సైట్లో స్లాట్ను రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.