News July 3, 2024

HYD: వీరిలో ఒకరికి మంత్రి పదవి?

image

ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో మంత్రి పదవి కోసం RR జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి, HYD నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని ఇటీవల సీఎం చెప్పడంతో దానం ఆశలు సన్నగిల్లాయి. కాగా గతంలో దానంకు రేవంత్ రెడ్డి మాట ఇవ్వడంతో ఆశతో ఉన్నారు.

Similar News

News March 6, 2026

HYDలో ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు!

image

అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో మార్పులతో ​సిటీలో యాడ్ బోర్డుల గోల మొదలైంది. 6ఏళ్లుగా 15 ఫీట్ లిమిట్‌ను సర్కార్ సైలెంట్‌గా ఎత్తేసింది. GHMC, CMC, MMCల్లో ఇక ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు వెలవనున్నాయి. పెద్ద కంపెనీలకు మేలు చేసేలా టెండర్ కండీషన్లు మార్చారని, చిన్న అడ్వర్టైజర్లు నష్టపోతారనే అరోపణలు ఉన్నాయి. 5ఏళ్ల కాంట్రాక్టుల పేరుతో రూ.కోట్లు ఆదాయానికి గండి కొట్టేలా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని టాక్.

News March 6, 2026

HYD: ఇంజినీరింగ్ కాలేజీలో కొత్త ఫీజులు ఖరారు

image

నగరంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ ఫీజులు అమలుచేయనున్నారు. 3 సంవత్సరాలపాటు (2027- 28వరకు) ఈ నిబంధనలు అమలవుతాయి. ఇదిలా ఉండగా CBITకి అత్యధిక ఫీజు రూ.1.83 లక్షలు, ఆ తర్వాత వాసవికి రూ.1.75 లక్షలు, MGITకి రూ.1.67 లక్షలు, CVRకు రూ.1.63 లక్షలు, నారాయణమ్మకు రూ.1.62 లక్షలుగా నిర్ధారించారు.

News March 6, 2026

HYDలో స్విమ్మింగ్ పూల్స్ ఇవే!

image

సమ్మర్ షురూ అవ్వగానే పిల్లల్లో ఈతపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో GHMC నగరవ్యాప్తంగా మొత్తం 14 స్విమ్మింగ్ పూల్స్‌ను సిద్ధం చేసింది. వనస్థలిపురం సచివాలయనగర్, ఫేజ్-4 కాలనీ, మొఘల్‌పురా, చందులాల్ బారాదరి, విజయ్‌నగర్ కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట్, అమీర్‌పేట, సనత్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, KPHB 6వ ఫేజ్ తదితర ప్రాంతాల్లో పూల్స్‌ను ఏర్పాటు చేశారు.
# SHARE IT