News February 17, 2025

HYD: వృద్ధాప్యంలో తల్లితండ్రుల ఆవేదన..!

image

ఏ తల్లితండ్రులైనా, తన పిల్లలు ప్రయోజకులు కావాలని అల్లారు ముద్దుగా పెంచుతారు. పెద్దయ్యాక పిల్లలు, వారి తల్లితండ్రుల మంచి, చెడ్డలను చూసుకోవడం మరుస్తున్నారు. వృద్ధాప్యంలోనూ కొడుకు, బిడ్డలపై ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు ఏం అనలేకపోతున్నారు. ఆర్డీవోల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ట్రైబ్యూనళ్లకు వస్తున్న ఫిర్యాదుల్లో HYD, మేడ్చల్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.

Similar News

News November 27, 2025

దక్షిణామూర్తి ఎవరు?

image

దక్షిణామూర్తి సకల విద్యలకు, తత్వజ్ఞానానికి ఆది గురువు. ఆయన మౌనంగా ఉంటూనే కేవలం చిన్ముద్ర ద్వారా శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఆయనను పూజిస్తే అజ్ఞానం తొలగి, బుద్ధి వికసించి, ఏకాగ్రత పెరుగుతుందని నమ్మకం. గురువు లేనివారు ఆయనను తమ సద్గురుగా భావించి పూజిస్తారు. శ్రీరాముడి గురువు అయిన వశిష్టుడు కూడా ఈయన దగ్గరే బ్రహ్మవిద్యను సంపాదించాడని పురాణాలు చెబుతున్నాయి.

News November 27, 2025

భారత్ వైట్ వాష్.. తప్పెవరిది?

image

SAతో 2 టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోవడాన్ని భారత ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటర్ల డిఫెన్స్ టెక్నిక్ పేలవంగా ఉందని, T20 ఫార్మాట్ అలవాటై గంటల కొద్దీ బ్యాటింగ్ చేసే ఓపిక నశించిందని అంటున్నారు. అటు ఎక్కువశాతం కోచ్ గంభీర్‌పై ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు, టీం సెలక్షన్ సరిగా చేయలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇంతకీ వైట్ వాష్‌కి కారణం ప్లేయర్లా, కోచ్ గంభీరా? కామెంట్ చేయండి.

News November 27, 2025

ఆవు పేడతో అలుకుత ఎందుకు చల్లాలి?

image

పూజలు, శుభకార్యాల సమయంలో ఆవు పేడతో అలుకుత చల్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆవు పేడ ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. కీటకాలను దూరం చేసే సహజ సిద్ధమైన పరిష్కారంగా దీన్ని భావిస్తారు. అప్పట్లో రసాయన క్రిమిసంహారకాలు ఉండేవి కాదు. అందుకే ఆ రోజుల్లో నేలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, సానుకూల శక్తిని నింపడానికి ఈ పద్ధతిని ఆచరించేవారు.