News February 17, 2025
HYD: వృద్ధాప్యంలో తల్లితండ్రుల ఆవేదన..!

ఏ తల్లితండ్రులైనా, తన పిల్లలు ప్రయోజకులు కావాలని అల్లారు ముద్దుగా పెంచుతారు. పెద్దయ్యాక పిల్లలు, వారి తల్లితండ్రుల మంచి, చెడ్డలను చూసుకోవడం మరుస్తున్నారు. వృద్ధాప్యంలోనూ కొడుకు, బిడ్డలపై ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు ఏం అనలేకపోతున్నారు. ఆర్డీవోల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ట్రైబ్యూనళ్లకు వస్తున్న ఫిర్యాదుల్లో HYD, మేడ్చల్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.
Similar News
News March 26, 2025
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ల వాల్యుయేషన్ ప్రారంభమైంది. అన్ని పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 29న ఎప్‌సెట్ ఉండటంతో దానికి 2, 3 రోజులు ముందుగానే రిజల్ట్స్ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.
News March 26, 2025
ఓట్ల కోసమే విభజన రాజకీయం: యోగి

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కొంతమంది దేశంలో విభజనలను సృష్టిస్తున్నారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని చట్టం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓట్ల కోసమే ప్రాంతం, భాష పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు తెస్తున్నారని, యూపీలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుంటున్నప్పుడు తమిళనాడులో హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని యోగి ప్రశ్నించారు.
News March 26, 2025
నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప్ప, కోటగిరిలో 40, మోస్రా 39.9, ధర్పల్లి, లక్మాపూర్ 39.8, యెడపల్లె, మెండోరా 39.7, ఎర్గట్ల, పెర్కిట్, మోర్తాడ్ 39.5, వేంపల్లి, వైల్‌పూర్ 39.3, సిరికొండ, ముప్కాల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీంగల్లో 39.1℃ఉష్ణోగ్రత నమోదైంది.