News July 6, 2024
HYD: వేగంగా HMDA భూముల డిజిటలైజేషన్!

HMDA భూములకు సంబంధించి GIS డిజిటల్ మ్యాపింగ్ చేసే ప్రక్రియ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొబైల్లో యాప్ ఓపెన్ చేస్తే చాలు అరచేతిలో భూముల వివరాలు, హద్దులతో సహా కనిపించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. HMDAకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,260 ఎకరాలను కేటాయించింది. నగర శివారు జిల్లాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం భూముల కేటాయింపు నిర్ణయం తీసుకుంది.
Similar News
News December 6, 2025
HYD: ఓఆర్ఆర్పై ఏఐ కెమెరాలతో నిఘా.!

ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. వీటి ద్వారా డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోనున్నారు. ఏఐ కెమెరాలు వీటిని పసిగట్టి పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందిస్తాయి. తద్వారా ప్రమాదాలు తక్కువయ్యే అవకాశం ఉంది.
News December 6, 2025
HYD: అడ్డూ అదుపు లేకుండా థియేటర్ల దోపిడీ.!

HYD మహానగరంలో సినిమా థియేటర్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. టికెట్ ధరతో సమానంగా.. కూల్ డ్రింక్స్, పాప్కాన్ పేరుతో దోచేస్తున్నారు. MRP ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో సినిమాకు వచ్చేవారు జేబులు గుల్లవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా డబ్బులు గుంజుతున్నారు. థియేటర్లకు రావాలంటేనే మధ్యతరగతి కుటుంబం బెంబేలెత్తిపోతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
News December 6, 2025
హైదరాబాద్లో హారన్ మోతలకు చెక్.!

హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


