News August 14, 2024
HYD: వేణుస్వామికి మహిళా కమీషన్ నోటీసులు
వేణుస్వామికి మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న స్వయంగా మహిళా కమీషన్ ఎదుట హాజరు కావాలని తెలంగాణ మహిళా కమీషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. నటుడు నాగ చైతన్య.. శోభిత ధూళిపాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని సోమవారం తెలగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర మహిళా కమిషన్‌కు పిర్యాదు చేశారు.
Similar News
News September 14, 2024
నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు
నిమ్స్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 14, 2024
గవర్నర్ వద్దకు వెళ్లిన సికింద్రాబాద్ ADRM
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ వెళ్లారు. గవర్నర్ పిలుపు మేరకు వెళ్లిన అధికారి, రైల్వే అభివృద్ధి, ఇతర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే సేఫ్టీపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించారు.
News September 14, 2024
HYD: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్‌కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది.