News August 12, 2024

HYD: వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

image

వేణు స్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రెటీస్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. సినిమా వారి జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు నాగచైతన్య-శోభిత ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషిస్తూ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

DANGER: HYDలో వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్ ప్రమాదాలు నగరంలో కలవరపెడుతున్నాయి. పోలీసుల వివారలిలా.. మియాపూర్‌ దావులూరి హోమ్స్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిని శివలీల (32) శనివారం వాటర్ హీటర్‌ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత హీటర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నాణ్యమైనవి కొనాలని, చేతులు తుడుచుకుని, చెప్పులు ధరించి స్విచ్ఆఫ్ చేశాకే ప్లగ్ పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 23, 2025

HYD: నగరవాసులకు జలమండలి విజ్ఞప్తి

image

గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని జలమండలి అధికారులు సూచించారు. నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని కొందరు వినియోగదారులను SMS ద్వారా బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి మెసేజ్‌లకు స్పందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందేశాల్లో వచ్చే APK డౌన్లోడ్ చేయొద్దన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ నం. 155313ని సంప్రదించాలని కోరారు.