News February 11, 2025

HYD: వేధింపులు.. ఈ నంబర్లు మీ కోసమే!

image

రాజధానిలోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులకు గురైనా.. తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. HYD-9490616555 , 8712662111, సైబరాబాద్-9490617444, తెలంగాణ మహిళా భద్రత విభాగం వాట్సాప్ 8712656856 ద్వారా సమాచారం తెలియచేస్తే కొద్ది క్షణాల్లోనే చర్యలు చేపడతామని తాజాగా పోలీసులు మహిళలకు భరోసా ఇస్తున్నారు.

Similar News

News March 21, 2025

సేవా పతకాలకు చిత్తూరు పోలీసులు ఎంపిక

image

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు పతకాలు వచ్చాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, మనోహర్, మునిరత్నం, దేవరాజుల నాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, నాంతుల్లా, బాలాజీ, హరిబాబు, మణిగండన్‌కు పథకాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

News March 21, 2025

సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ

image

TG: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎంకు వారు ఫిర్యాదు చేశారు.

News March 21, 2025

నటి రజిత ఇంట్లో విషాదం

image

ప్రముఖ నటి రజిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి(76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం తెలియజేశారు. రజిత 1986 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగులో దాదాపు 200 చిత్రాల్లో నటించారు.

error: Content is protected !!