News February 12, 2025
HYD: వేధింపులు.. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని మృతి (UPDATE)

ఫీజు కట్టాలని వేధింపులు తాళలేక మేడ్చల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అఖిల మంగళవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అఖిల చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇదే విషయమై పలువురు పాఠశాల యాజమాన్యం వైఖరిపై మండిపడుతున్నారు.
Similar News
News October 26, 2025
VZM: తుఫాను ఎఫెక్ట్.. ప్రత్యేకాధికారిగా సుభాష్

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. విజయనగరం జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారిగా సుభాష్ను నియమిస్తూ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాకు చేరుకున్నారు.
News October 26, 2025
మొంథా తుఫాను పయనమిలా..

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.
News October 26, 2025
ప.గో.: కలెక్టర్, జేసీతో సమావేశమైన ప్రసన్న వెంకటేశ్

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్తో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, ముందస్తుగా తీసుకున్న చర్యలపై సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


