News March 21, 2024
HYD: వైద్యంలో డ్రోన్ టెక్నాలజీ.. ఇక సులభం!

HYDలోని ICMR, JNTU ఆచార్యులు వైద్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించారు. రాజధాని సహా శివారు ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త, మూత్ర నమూనాలను డ్రోన్స్ ద్వారా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఒక్కోటి 60-75 KM దూరాన్ని చేరుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించామని, ముగ్గురు డ్రోన్ పైలెట్లు వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాధార మందులను సైతం పంపిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.