News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.
Similar News
News November 28, 2025
DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

TG: తన G.O.A.T. టూర్ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్బాల్ స్టార్ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
భారత్ తగ్గేదే లే.. GDP వృద్ధి రేటు 8.2%

భారత జీడీపీ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6%గా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నంబర్లను రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక రంగం మెరుగ్గా రాణించడం విశేషం.
News November 28, 2025
పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలి: గరిమా అగ్రవాల్

విద్యార్థులు పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పాఠశాలల విద్యార్థుల జిల్లాస్థాయి ఇన్స్పైర్, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, రాజ్య స్థరీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన(RS బీవీపీ) శుక్రవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఇంచార్జి కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు.


