News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.
Similar News
News February 12, 2026
నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖంచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.
News February 12, 2026
గ్లోబల్ మార్కెట్లో నరవణె బుక్.. ప్లాన్ ప్రకారమే లీక్!

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19103224>>పుస్తకం లీక్<<>>పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రక్షణ శాఖ అనుమతి లేకున్నా గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం, సమన్వయంతో చేసిన లీక్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పుస్తకం US, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో అందుబాటులోకి వచ్చినట్లు చెప్పాయి. దీంతో ఆ దేశాల్లో డిజిటల్, ఫైనాన్షియల్ మార్గాలను ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించాయి.
News February 12, 2026
NLG: మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి తెలిపారు. DVK డిపో నుంచి శ్రీశైలం, KDD డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, HZNR నుంచి మేళ్లచెర్వుకు, MLG డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. SRPT డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు.


