News August 13, 2024
HYD: వైన్స్ వద్ద సిట్టింగ్ తొలగించాలని డిమాండ్

రాష్ట్రంలోని వైన్‌షాపుల వద్ద అక్రమ సిట్టింగులను తొలగించాలని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జీవో 25 ప్రకారం వైన్‌షాప్ పర్మిట్ గది 100 చదరపు మీటర్లు ఉండాలన్నారు. ఎలాంటి బెంచీలు, కుర్చీలు, తినుబండారాలు లేకుండా నిర్వహించాలని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
HYD: సర్పంచ్ ఎన్నికలే లక్ష్యం.. టీబీజేపీ దూకుడు

రాష్ట్రంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో 1000 సీట్లు గెలవాలని టీబీజేపీ TBJP లక్ష్యంగా పెట్టుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమి తర్వాత, పార్టీ ఈ వ్యవస్థీకృత కార్యాచరణను ప్రారంభించింది. ఈ ఎన్నికల ఖర్చును పూర్తిగా సిట్టింగ్, గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులే భరించాలని ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతాన్ని, నాయకత్వాన్ని బలోపేతం చేయడమే ఈ వ్యూహం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.

HYD: రైల్వే ఫుడ్‌లో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

నాగపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తున్న ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. రైల్వే ఫుడ్ ఓపెన్ చేసి తినే సమయంలో ఒక్కసారిగా దాంట్లో బొద్దింక కనబడటంతో షాక్ అయ్యాడు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై చర్యలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేశారు.