News March 30, 2024

HYD: వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసుల దాడి

image

వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ అనే ఆర్గనైజర్ విజయపురి కాలనీలో ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఓ మహిళ(30)తో వ్యభిచారం నడిపిస్తున్నాడు. కస్టమర్ వ్యభిచార గృహంలో ఉండగా.. మల్కాజిగిరి SOT పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆర్గనైజర్ సురేశ్ పరారీలో ఉన్నాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 10, 2026

OFFICIAL: ఫ్యూచర్ సిటీ పనులు షురూ! (1)

image

HYD ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యే దిశగా తొలి అడుగు పడింది. మీర్‌ఖాన్‌పేటలోని ఫార్మా సిటీలో రూ.4.73 కోట్లతో భారీ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు TGIIC పనులు మొదలుపెట్టనుంది. కందుకూరులో అత్యాధునిక రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఫ్యూచర్ సిటీలో వర్షపు నీరు నిలవకుండా, వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకొంటున్నారు.

News April 10, 2026

OFFICIAL: ఫ్యూచర్ సిటీ పనుల వెనక వ్యూహం (2)

image

ఫ్యూచర్ వెనుక ఉన్న వ్యూహం చాలా పెద్దది. మీర్‌ఖాన్‌పేట్, కందుకూరులో పారిశ్రామిక హబ్‌ను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. RR జిల్లాలోని ఈ ప్రాంతం ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి గేట్‌వేగా మారుతోంది. ఈ పనుల ద్వారా స్థానికంగా రియల్ ఎస్టేట్, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టనుంది.

News April 10, 2026

కాచిగూడలో దారుణం.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

image

మైనర్ బాలికపై ఓ బాలుడు(మైనర్) లైంగికదాడికి పాల్పడిన ఘటన కాచిగూడ PS పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తులసీరామ్‌నగర్‌కు చెందిన మైనర్(13)కు ఇన్‌స్టా రీల్స్ ద్వారా గోల్నాక ప్రాంతానికి చెందిన బాలుడు పరిచయమయ్యాడు. బాలికతో స్నేహం పెంచుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు.