News March 2, 2025

HYD: వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

image

అంబర్‌పేట్ గోల్నాక జిందాతిలిస్మాత్ వీధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అందులో ముగ్గురు ఉగాండా, ఒకరు కెన్యా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 3, 2025

HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

image

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.

News March 3, 2025

HYD: 18 ఏళ్లు నిండకముందే పెళ్లి పీటల పైకి..!

image

HYD, RR,MDCL జిల్లాలో 18 ఏళ్లు నిండకముందే బాలికలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పిల్లలకు త్వరగా పెళ్లి చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని తల్లిదండ్రులు ఉన్నారు. బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ వారికి శాపంగా మారుతుంది. మేడ్చల్లో 54, HYDలో 46, రంగారెడ్డిలో 54 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.

News March 3, 2025

నేరాలపై సైబరాబాద్ పోలీసులు ఫోకస్

image

CYB కమిషనరేట్‌ పరిధి 510 ప్రాంతాల్లో శనివారం DCPల ఆధ్వర్యంలో రైడ్స్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్న 380 మందిని అదుపులోకి తీసుకోగా.. గంజాయి తాగుతున్న14 మందిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా కేసులు 1, వ్యభిచారం 26, నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై2, బహిరంగ ప్రదేశాల్లో మందు తాగిన ఘటనలో 15 కేసులు, న్యూసెన్స్ 57, నంబర్ ప్లేట్ లేని 18 వాహనాలపై కేసులు నమోదు కాగా 4 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు.

error: Content is protected !!