News January 28, 2025
HYD: శంకర్‌పల్లికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి రానున్నారు. ఇక్కడ 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం పార్కును మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం ప్రారంభించనున్నారు. ఉ.11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్క్ అధినేత రాందేవ్‌రావు తెలిపారు. తమ పార్క్‌లో అరుదైన జాతులకు సంబంధించి 25 వేల రకాల మొక్కలను పెంచామన్నారు.
Similar News
News February 23, 2026
HYD: MCHRD.. CM క్యాంప్ ఆఫీస్ కాబోతుందా..?

HYDలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ.9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్‌కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధునిక వాచ్ టవర్లు, పటిష్ఠమైన గేట్లతో పాటు పరిసరాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు. దీనిని CM క్యాంప్ ఆఫీస్‌గా వాడనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
News February 23, 2026
ఏప్రిల్ 8న AA22 ఫస్ట్ టీజర్?

అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో AA22 మూవీ షూటింగ్ సగం పూర్తయినట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పెరిగింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, రష్మిక, మృణాల్, జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.
News February 23, 2026
HYD: తెలుగు వర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో TG ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫైన్ లేకుండా మార్చి 10లోగా, రూ.1,000 ఫైన్‌తో మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 8143165646ను సంప్రదించవచ్చు. site: pstucet.org


