News January 28, 2025

HYD: శంకర్‌పల్లికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి

image

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి రానున్నారు. ఇక్కడ 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం పార్కును మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం ప్రారంభించనున్నారు. ఉ.11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్క్ అధినేత రాందేవ్‌రావు తెలిపారు. తమ పార్క్‌లో అరుదైన జాతులకు సంబంధించి 25 వేల రకాల మొక్కలను పెంచామన్నారు.

Similar News

News February 13, 2025

తాడేపల్లి: రేపు కడప వెళ్లనున్న మాజీ సీఎం

image

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ శుక్రవారం కడప వెళ్లనున్నట్లు పార్టీ సెంట్రల్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని తెలిపారు.

News February 13, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్,  సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు. రీవాల్యుయేషన్‌కు రేపటి నుంచి విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News February 13, 2025

తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

image

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.

error: Content is protected !!