News June 23, 2024
HYD: శంషాబాద్‌లో దారుణం

శంషాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. RGIA పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్‌కు చెందిన దంపతులు కూలీలు. వారికి కూతురు ఉంది. ఈక్రమంలో అనారోగ్యంతో భర్త 2నెలల క్రితం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య ఇటీవల పనుల కోసం బయటకు వెళ్లగా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. అదే రోజు వరుసకు చిన్నాన్న అయ్యే యాకేశ్ ఇంట్లోకి వెళ్లి బాలిక(14)ను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News October 31, 2025
మాగంటి సునీతపై బోరబండ PSలో కేసు నమోదు

బీఆర్ఎస్ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునితపై ఇచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ PSలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 31, 2025
HYD: ‘రన్ ఫర్ యూనిటీ’లో సీపీ, చిరంజీవి

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్, నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఐక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, ఔత్సహికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
News October 31, 2025
BRS కేడర్‌కు నవీన్ యాదవ్ వార్నింగ్.. ECకి ఫిర్యాదు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని BRS ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్‌ను లేకుండా చేస్తానని నవీన్ యాదవ్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, కిషోర్ గౌడ్ తదితరులు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు.


