News August 12, 2024

HYD: శాంతిభద్రతలు గాడి తప్పాయి:  MLA ముఠాగోపాల్

image

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గాడి తప్పాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో రోజుకో హత్య జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో పాలన లేకపోవడం వల్ల చెత్తాచెదారం, మట్టికుప్పలు పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. దోమల వ్యాప్తి పెరిగిపోతుండటంతో, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్‌ఖానా!

image

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్‌ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్‌ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.

News July 6, 2025

HYD: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? జాగ్రత్త.!

image

సెకండ్ హ్యాండ్‌లో సెల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు దొంగిలించిన మొబైళ్లను దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇటీవల వనస్థలిపురంలో సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ కొని సిమ్ కార్డు వేసిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తనకు అమ్మారని తెలుసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు. ఇటువంటి విషయంతో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News July 5, 2025

BREAKING: HYD: వికారాబాద్ విహారయాత్రలో మహిళలు మృతి

image

HYD నుంచి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు శనివారం మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలోని వెల్డర్‌నెస్ రిసార్ట్‌కు HYDకు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సా.5 గంటలకు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.