News June 11, 2024

HYD: శాశ్వత వీసీల నియామకం మరికొంత ఆలస్యం!

image

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్‌ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్‌ఛార్జుల పదవీకాలం పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

Similar News

News March 19, 2025

హైదరాబాద్‌‌లో ముంచుకొస్తున్న ముప్పు!

image

HYD‌కు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్‌పల్లి, మాదాపూర్‌, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.

News March 18, 2025

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన జర్నలిస్టులు

image

చంచల్‌గూడ జైలులో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు తన్వి యాదవ్, రేవతిలు విడుదలయ్యారు. సోమవారం నాంపల్లి కోర్టు యూట్యూబ్ జర్నలిస్టులకు రూ.25వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై యూట్యూబ్ జర్నలిస్టులు తమ ఛానల్లో ప్రసారం చేసిన ఓ వీడియోపై రిమాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

News March 18, 2025

రంగారెడ్డి: 2nd ఇయర్ పరీక్షకు 2,399 మంది డుమ్మా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో 73,192 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,793 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,399 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

error: Content is protected !!