News March 28, 2025

HYD: శాసనమండలి సభ్యులను సన్మానించిన సీఎం

image

శాసనమండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసనమండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న తొమ్మిది మంది సభ్యులను సత్కరించారు. మార్చి 29వ తేదీతో వీరి పదవి కాలం ముగియనుంది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

HYD: 5 ఏళ్లలో 2 లక్షల కిడ్నీ కేసులు.. జర జాగ్రత్త..!

image

వయసుకు, ఆరోగ్యానికి సంబంధం లేకుండా కిడ్నీ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో HYDలోని ఆసుపత్రుల్లో రెండు లక్షలకు పైగా మంది చికిత్స తీసుకోవడం ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధులకు చికిత్సలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు అధికంగా నీరు తీసుకోవడంతోపాటు శారీరక శ్రమ చేయడం, న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

News November 15, 2025

ఇక గాంధీ భవన్ చూపు.. గ్రేటర్ HYD వైపు..!

image

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ టెంపోను ఇలాగే కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఈ విజయం స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో పాగా వేయాలని గాంధీభవన్ ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు నాయకులు కేడర్‌కు దిశానిర్దేశం చేయనుంది. గ్రేటర్ HYDలో పక్కాగా ప్లాన్ వేసి వందకు తగ్గకుండా కార్పొరేటర్ సీట్లు సాధించి మేయర్ సీటు పట్టాలని ఆశిస్తోంది.

News November 15, 2025

జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.