News November 9, 2024
HYD: శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు బుక్ చేసుకోండి!

పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు HYD నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. NOV 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని, ఏపీ పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు.
Similar News
News November 27, 2025
హైదరాబాద్ బిర్యానీ తగ్గేదేలే!

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే బెస్ట్ ఫుడ్ జాబితాలో HYD బిర్యానీ ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఫుడ్ గైడ్ టెస్ట్ అట్లాస్ జాబితా ‘50 ఉత్తమ బియ్యం వంటకాలు- 2025’లో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో ఇది వెల్లడైంది. HYD బిర్యానీ కంటే ముందు నెగిటోరోడాన్, సూషి, కైసెండన్, ఒటోరో నిగిరి, చుటోరో నిగిరి, నిగిరి, మాకి నిలిచాయి. ఇంతకీ HYDలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది.
News November 27, 2025
HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
News November 27, 2025
HYD: మీ చేతిరాత బాగుంటుందా?

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.


