News January 26, 2025

HYD: శ్రీచైతన్య విద్యాసంస్థల కిచెన్ లైసెన్స్ రద్దు

image

మాదాపూర్ శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్‌లో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు తాము గుర్తించామని అధికారులు తెలిపారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు గడువు తీరిన 125 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేశామని తెలిపారు. 

Similar News

News November 23, 2025

అమెరికా వీసా రిజెక్ట్.. HYDలో డాక్టర్ సూసైడ్

image

అమెరికా J1 వీసా రాలేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ సూసైడ్ చేసుకుంది. గుంటూరుకి చెందిన డాక్టర్ రోహిణి కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం ఇటీవల వీసాకు అప్లై చేయగా.. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కలత చెందిన రోహిణి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుంటూరులోని సొంత నివాసానికి తరలించారు.

News November 23, 2025

HYD: వీకెండ్‌ పార్టీ.. రోడ్డెక్కితే దొరికిపోతారు!

image

వీకెండ్ వస్తే మందుబాబులు వైన్స్, బార్‌లు, పబ్‌లో చిల్ అవుతారు. తాగిన మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా HYD పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందల మంది పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ అయ్యాయి. కౌన్సెలింగ్, కోర్టుకెళ్లి జరిమానా కట్టాల్సిన పరిస్థితి. D & D డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా తనిఖీల్లో దొరికి తలలు పట్టుకుంటున్నారు.

News November 23, 2025

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

image

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్‌’ను చార్మినార్‌‌లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.