News December 21, 2024
HYD: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్సకు స్పందిస్తున్నాడు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. నాడీ వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా పనిచేస్తుందని.. నిన్నటి కంటే ఈరోజు శ్రీతేజ ఆరోగ్యం మెరుగైందని శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Similar News
News November 24, 2025
HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.


