News March 16, 2025

HYD: శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం

image

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును HYDలోని తెలుగు విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారు. 1985లో DEC 2న నాటి CM NTR ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత దీనికి 1998లో అమరజీవి పేరు పెట్టారు. కూచిపూడిలోని సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. తెలుగు ప్రజల కోసం ఆత్మబలిదానం చేసిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.

Similar News

News December 9, 2025

HYD: గ్రేట్.. 9 మందికి ప్రాణం పోశారు!

image

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడకు చెందిన ముత్తులూరు కృష్ణకుమారి (58), నల్గొండ రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్‌ డెడ్ కావడంతో వారి కుటుంబాలు అవయవదానానికి ముందుకొచ్చాయి. ఈ మహోన్నత నిర్ణయం ద్వారా కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను సేకరించి 9 మందికి ప్రాణం పోశారు. తమ బాధను పక్కన పెట్టి చూపిన వీరి త్యాగం అందరికీ స్ఫూర్తినిచ్చింది. అవయవదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి ఊపిరిపోద్దాం.

News December 9, 2025

అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్

image

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్ జారీ చేసింది. అయ్యప్ప ఆలయానికి సమీపంలో ఉన్న ఉరక్కుళి జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించింది. ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, ఏనుగులు, వన్యప్రాణుల సంచారం కూడా పెరగడం, ఆ మార్గం ఏటవాలుగా, జారుడుగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ సూచనలు చేసింది. సాధారణంగా అడవిలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తారు.

News December 9, 2025

విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

image

CM చంద్రబాబు ఈనెల 12న‌ విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.