News April 17, 2024
HYD: శ్రీరామ శోభాయాత్రలో దొంగల బీభత్సం
శ్రీరామ శోభాయాత్రలో దొంగలు చేతివాటం చూపించారు. పలువురు భక్తుల నుంచి సెల్‌ఫోన్లు, ఆభరణాలు అపహరించారు. దాదాపు 16 సెల్‌ఫోన్లు, 3 బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్ చోరీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పాతబస్తీ మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News January 11, 2025
HYD: డేటింగ్ పేరుతో పిలిచి.. చివరికీ ఇలా..!
డేటింగ్ యాప్ పేరుతో యువకులు మోసపోతున్నారు. డేటింగ్ యాప్ ద్వారా యువకులను బుట్టలో వేసుకుంటున్న కొందరు, అర్ధరాత్రి యువకులకు ఫోన్ చేసి, నిర్మానుష్య ప్రాంతాలకు పిలిచి, డబ్బులు డిమాండ్ చేస్తూ అవసరమైతే బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు HYDలో 10కి పైగా జరిగాయి. ఇటీవలే అత్తాపూర్‌లోనూ ఇలాంటి ఘటనలు జరగగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. # SHARE IT
News January 10, 2025
HYD: 2030 నాటికి 10వేల ఛార్జింగ్ స్టేషన్లు..50% అక్కడే!
2030 నాటికి 10వేల EV ఛార్జింగ్ స్టేషన్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటికోసం ప్రణాళికలు సిద్ధం చేయగా, దాదాపు 50% హైదరాబాద్ మహానగరంలోనే ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. 2024 నవంబర్ నెలలో నూతనంగా తెచ్చిన ఈవీ పాలసీ మేలు చేయనుంది. మరోవైపు HYD నగరంలో మొత్తం ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News January 10, 2025
HYD: ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’
వైకుంఠ ఏకాదశి వేడుకలను అన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’ మంత్రం పఠిస్తూ భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజధాని ప్రజలు పెద్ద ఎత్తున చీర్యాలకు క్యూ కట్టారు. దీంతో ECIL-నాగారం-రాంపల్లి చౌరస్తా- చీర్యాల రూట్‌లో వాహనాల రద్దీ నెలకొంది. SHARE IT