News October 7, 2024

HYD: శ్రీ భవాని దేవి అలంకరణలో ఉజ్జయిని మహంకాళమ్మ

image

సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు మహంకాళి అమ్మవారిని భవానీ దేవిగా ఆలయ పూజారులు అలంకరించారు. అమ్మవారి దర్శనానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వేద పండితులు నిత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: 2018 నుంచి BRS VS కాంగ్రెస్

image

జూబ్లీహిల్స్‌లో ఎన్నికలను పరిశీలిస్తే 2018 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, BRS మధ్యే పోటీ నడుస్తోంది. 2018లో TRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలవగా INC అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2023లో BRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మళ్లీ గెలవగా INC అభ్యర్థి అజహరుద్దీన్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఉపఎన్నికలో INC అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవగా BRS అభ్యర్థి మాగంటి సునీత సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.

News November 14, 2025

న‘విన్’ వెనుక 11 ఏళ్ల కృషి!

image

విజయం ఊరికే రాదు అనడానికి జూబ్లీహిల్స్‌ ఫలితం నిదర్శనం. నవీన్ యాదవ్ 11 ఏళ్ల కృషికి ప్రతిఫలం ఇది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో MIM అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మాగంటి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లోనూ స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమినే చవిచూశారు. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ 2023లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సారి బైపోల్‌లో CM రేవంత్ ఇచ్చిన ఛాన్స్‌ను మిస్ చేయకుండా విక్టరీ కొట్టారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.