News August 5, 2024

HYD: షాద్‌నగర్ ఘటనపై సీఎం సీరియస్

image

బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.

Similar News

News July 6, 2025

వరల్డ్‌లో HYD బిర్యానీ ది BEST!

image

HYD బిర్యానీ.. ఈ పేరు ఒక ఎమోషన్. దీని రుచి వరల్డ్ ఫేమస్‌. సిటీలో దమ్ బిర్యానీ‌ తింటే ఫిదా అవ్వాల్సిందే. మాంసానికి మసాలా అంటించి, పెరుగు, నెయ్యి, నిమ్మకాయ రసం బాగా పట్టిస్తారు. బాస్మతి రైస్‌తో మాంసాన్ని ఉడికించి బిర్యానీ రెడీ చేస్తారు. ఫైనల్‌గా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు ఈ వంటకానికి మరింత రుచినిస్తాయి. ఇన్ని మిశ్రమాలతో చేసే HYD బిర్యానీ వరల్డ్ బెస్ట్‌గా నిలవడం విశేషం.
నేడు World Biryani Day

News July 6, 2025

HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్‌ఖానా!

image

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్‌ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్‌ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.

News July 6, 2025

HYD: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? జాగ్రత్త.!

image

సెకండ్ హ్యాండ్‌లో సెల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు దొంగిలించిన మొబైళ్లను దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇటీవల వనస్థలిపురంలో సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ కొని సిమ్ కార్డు వేసిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తనకు అమ్మారని తెలుసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు. ఇటువంటి విషయంతో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.