News December 20, 2024
HYD: సంక్రాంతికి ఊరెళుతున్నారా.. నో బెర్త్..?

సంక్రాంతి సెలవుల్లో సరదాగా సొంతూరికి వెళ్లాలని అనుకుంటున్న నగరవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ‘నో.. బెర్త్’ అంటూ చూపించడంతో తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్, నాగావళి, జన్మభూమి, ఫలక్నుమా, విశాఖ, గరీబ్ రథ్, గోదావరి తదితర రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ 300 వరకు కనిపిస్తూ ఉంది. వీటితో పాటు స్పెషల్ ట్రైన్లలోనూ ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది.
Similar News
News November 20, 2025
HYD: అర్ధరాత్రి రోడ్లపై తిరిగిన ముగ్గురి యువకుల అరెస్ట్

అర్ధరాత్రి రోడ్లపై కారణం లేకుండా తిరుగుతున్న ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులపై పెట్టీ కేసులు నమోదు చేసి, వారిని 3 – 7 రోజుల రిమాండు విధించారు. ఇకనుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరగకూడదని ప్రజలను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు.
News November 20, 2025
రాజకీయ లబ్ధికోసం KTRపై అక్రమ కేసులు: హరీశ్

HYD బ్రాండ్ ఇమోజీని పెంచిన KTRపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న KTRపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిపొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
News November 20, 2025
HYD: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని

ఈ కార్ రేసు అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఛార్జ్ షీట్ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, సీఎం అంటే గౌరవంలేకుండా పొగరుగా వ్యవహిరించడం ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు.


