News January 10, 2025
HYD: సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు: మంత్రి

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రత్యేక బస్సులు నేటి నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని ఆర్టీసీ అధికారులు ప్రతి మేజర్ బస్స్టేషన్ వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News November 17, 2025
రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.

NIMSలో నర్సులకు డయాబెటిస్ సంరక్షణపై ప్రత్యేక శిక్షణ

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా సోమవారం నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం నర్సింగ్ సిబ్బంది కోసం ‘డయాబెటిక్ పేషెంట్ కేర్’ పై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించింది. హెచ్.ఓ.డి. ప్రొఫెసర్ ఎం.వి.ఎస్. సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మధుమేహ రోగుల కౌన్సెలింగ్, ఇన్సులిన్ వినియోగం, డయాబెటిక్ కిటోఆసిడోసిస్ (DKA), హైపోగ్లైసీమియా వంటి అత్యవసర పరిస్థితుల నిర్వహణపై లోతైన అవగాహన కల్పించారు.