News December 18, 2024

HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాట (UPDATE)

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. KIMSలో బాలుడు శ్రీతేజ్‌‌ను HYD కమిషనర్‌తో పాటు MLC తీన్మార్ మల్లన్న, పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. అతడు కోలుకోడానికి సమయం పట్టేలా ఉందన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అల్లు అర్జున్ చెప్పినా.. పుష్ప-2 లాభాల్లో 10 శాతం వాటా ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు. బాలుడిని హీరో పరామర్శించాలన్నారు. దీనిపై మీ కామెంట్..?

Similar News

News November 14, 2025

Jubilee hills bypoll: రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు!

image

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరగనుంది. అయితే, రౌండ్ల వారీగా రిజల్ట్ అప్‌డేట్స్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ECI చర్యలు తీసుకుంది. స్టేడియంలో LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని అధికారులు చెప్పారు. Way2Newsలోనూ ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాల వివరాలు చూసుకోవచ్చు.
SHARE IT

News November 14, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రతి ఓటు కీలకమే..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS మధ్య థగ్ ఆఫ్ వార్ పోటీ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 4,01,365 ఓట్లు ఉండగా అందులో 1,94,631 మంది ఓటేశారు. ఏ పార్టీ గెలిచినా మెజార్టీ ఎక్కువ ఉండదనే చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: NOTAతో కలిపి 59 మంది.. ECI స్పెషల్ పర్మిషన్

image

జూబ్లీహిల్స్‌లో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ECI నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి కౌంటింగ్‌ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, ECI బృందం పరిశీలించనుంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు.