News December 18, 2024
HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాట (UPDATE)
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. KIMSలో బాలుడు శ్రీతేజ్‌ను HYD కమిషనర్‌తో పాటు MLC తీన్మార్ మల్లన్న, పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. అతడు కోలుకోడానికి సమయం పట్టేలా ఉందన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అల్లు అర్జున్ చెప్పినా.. పుష్ప-2 లాభాల్లో 10 శాతం వాటా ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు. బాలుడిని హీరో పరామర్శించాలన్నారు. దీనిపై మీ కామెంట్..?
Similar News
News January 20, 2025
HYD స్విమ్మర్ సరికొత్త రికార్డు
HYD కాచిగూడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్(20)తో కలిసి ఆదివారం అరేబియా సముద్రంలోని మండ్వాజెట్ నుంచి ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి చరిత్ర సృష్టించారు. తల్లీకుమారుడు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి.
News January 19, 2025
HYD: రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ: కలెక్టర్లు
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు వార్డు సమావేశాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చిన 2,05,019 దరఖాస్తులను పరిశీలిస్తామని, ప్రజా పాలనలో వచ్చిన అభ్యర్థనలను కూడా పరిశీలిస్తామన్నారు.
News January 19, 2025
HYD: OYO బంద్ చేయాలని డిమాండ్
OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.