News August 20, 2024

HYD: ‘సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి’

image

రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయమని పలువురు కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, శ్రీధర్, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి, తిగుళ్ల కృష్ణమూర్తి, ఏలె లక్ష్మణ్ తదితరులు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

Similar News

News September 14, 2024

HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి

image

ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.

News September 14, 2024

HYD: 10 నిమిషాలతో సగం రోగాలు దూరం: GHMC

image

గ్రేటర్ HYD ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక సూచన చేసింది. రోజూ 10-15 నిమిషాల పాటు వేడి చేసి, చల్లార్చి గురువెచ్చని నీటిని తాగితే సగం రోగాలు దూరమవుతాయని తెలిపింది. నీటి కలుషితంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, బ్రష్ చేసేటప్పుడు, వంట వండేటప్పుడు, కూరగాయలు, పండ్లు కడిగేటప్పుడు వేడిచేసిన నీటితో కడగటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. RR, MDCL, VKB ప్రజలు సైతం పాటించాలని డాక్టర్లు సూచించారు.

News September 14, 2024

గవర్నర్ వద్దకు వెళ్లిన సికింద్రాబాద్ ADRM

image

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ వెళ్లారు. గవర్నర్ పిలుపు మేరకు వెళ్లిన అధికారి, రైల్వే అభివృద్ధి, ఇతర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే సేఫ్టీపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించారు.