News January 2, 2025
HYD: సచివాలయంలో నేడు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్గా వ్యవహరించనుండగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు భేటి కానున్నారు.
Similar News
News January 8, 2025
HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు
అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.
News January 8, 2025
చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?
చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో ప్రారంభమైంది. స్టేషన్కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?
News January 7, 2025
HYD: నుమాయిష్కు వెళుతున్నారా? నేడు లేడీస్ డే..!
84వ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మంగళవారం లేడీస్ డే నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కే.నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి వెల్లడించారు. ఎగ్జిబిషన్ మంగళవారం కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. మహిళలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఉమెన్స్ స్పెషల్ డే ప్రోగ్రామ్కు రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పాల్గొంటున్నట్లు తెలిపారు.